BB6 TELUGU NEWS 5 Aug 2025 :
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సీజన్ వ్యాధుల పట్ల మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని తెలియజేశారు ప్రతి ఆశ వర్కర్ మొదలుకొని అందరూ ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని డెంగ్యు మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలియజేశారు ప్రభుత్వ ఆస్పత్రి లో అన్ని రకాల రక్త పరీక్షలు మరియు మందులు అందుబాటులో ఉన్నాయని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ ఏఎన్ఎం ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
మండల ప్రజలు సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మండల వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్

05
Aug