గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ గా బతుకుదెరువు కోసం డ్రైవింగ్ చేస్తూ సాటి ఆటో డ్రైవర్ల పట్ల మానవత్వం చూపిస్తున్న కుల్కచర్ల వాసి వడ్డే శివ ప్రకాష్ .
హైదరాబాద్‌లో విషాదం, ఆటో డ్రైవర్ మృతి, నగరంలోని మైండ్ స్పేస్ వద్ద ఈ నెల 26న ఒక ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆ డ్రైవర్ ఆటోలోనే విగతజీవిగా కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి ఆటో డ్రైవర్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మానవత్వంతొ సహచరులు ఈ సంఘటనను తెలుసుకొని వడ్డే శివప్రకాష్,వెంకట్ డ్రైవర్లు వెంటనే స్పందించారు. తమ మేలుకో ఆటో డ్రైవర్ అన్న టీమ్‌లోని సభ్యులతో చర్చించి, ప్రతి ఒక్కరి నుండి కొంత డబ్బు సేకరించి, మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.కుటుంబానికి అండగా మృతునికి ఇద్దరు కూతుర్లు ఉండటంతో, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, 22,350 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా, ఆ డబ్బును వారిద్దరి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సూచించారు.
ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. అయితే, తోటి ఆటో డ్రైవర్లు చూపిన మానవత్వం అందరినీ కదిలించింది. హాజరైన వారు వడ్డే శివప్రకాష్, వెంకట్ డ్రైవర్ ఆర్ యాదగిరి, వెంకటేష్,జైపాల్, నరసింహ, ఇతరులు హాజరయ్యారు.