తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో రూ.230 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

BB6 News Telugu 30 july 2025 : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో దాదాపు రూ.230 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.జంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, యాలాల్ మండలం దౌలాపూర్ లో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు మరియు రూ.20 కోట్లతో నియోజకవర్గానికి మంజూరైన ఆరు 33/11 KV సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన, తాండూరు పట్టణంలో దాదాపు రూ.10 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం GPR ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర, రెడ్డి. చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్,ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత,డీసీసీబీ చైర్మన్ సత్యయ్య,ఎస్పీ నారాయణ రెడ్డి,తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్,నాయకులు డా. సంపత్ కుమార్,మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు,మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్,నాయకులు హబీబ్ లాల,కావలి సంతోష్ కుమార్, బంటువేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి,పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి,జిల్లా విద్యుత్, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు, పాల్గొన్నారు.

ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe