Telangana Pension: పెన్షన్ లబ్దిదారులకు అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్. రెడీగా ఉండండి!

Telangana Pension: తెలంగాణ పెన్షన్ల పథకంలో భారీ భూకంపం వచ్చేలా ఉంది. ప్రభుత్వ నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క కాబోతోంది. ఇది కచ్చితంగా కొంతమందికి పెద్ద సమస్యే అవ్వొచ్చు. ఐతే.. ప్రభుత్వం సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగైతే.. పెన్షన్ల జారీలో ప్రక్షాళన చేపట్టిందో, సేమ్ అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా.. పెన్షన్ల పథకంపై ప్రక్షాళన చేపడుతోంది. దీనిపై ఇటీవల మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పుడు ఇది మరో అడుగు ముందుకు వేసింది. తాజా అప్‌డేట్ ప్రకారం.. అన్ని జిల్లాల్లో ఒకేసారి ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో పెన్షన్ ఇచ్చే ప్రక్రియ చేపడతారు. పూర్తి వివరాలు చూద్దాం.

మీరు గమనించే ఉంటారు.. మన స్మార్ట్ మొబైల్‌ ఓపెన్ అవ్వాలంటే.. మన వేలి ముద్ర అవసరం అవుతోంది. అలాంటి మొబైల్స్ ఈ రోజుల్లో వచ్చేశాయి. వేలి ముద్ర కారణంగా.. మనం తప్ప మరెవ్వరూ ఆ మొబైల్ చెయ్యలేరు. ఇదే విధానాన్ని పెన్షన్ పంపిణీకీ వర్తింపజేశారు. ఐతే.. ముసలివారి వేళ్లకి.. చర్మంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. అందువల్ల వేలి ముద్ర సరిగా పడట్లేదు. అందుకే.. ముఖాన్ని గుర్తించి పెన్షన్ ఇచ్చే విధానం తెస్తున్నారు.

ఫేషియల్ రికగ్నిషన్ తేలికైనదే. ఎండ వచ్చే వైపుగా మనిషిని ఉంచి.. మొబైల్‌ యాప్‌తో ఫేస్‌ని గుర్తించేలా చేస్తారు. వెంటనే ఆ ఫేస్‌ని యాప్ గుర్తుపడుతుంది. దాంతో.. ఆ వ్యక్తి పెన్షన్ లబ్దిదారుడా, కాదా అనేది చెప్పేస్తుంది. లబ్దిదారులు అయితే, పెన్షన్ ఇస్తారు. ఇచ్చినట్లుగా యాప్‌లో నమోదు చేస్తారు. అదే ఫేస్‌ని గుర్తుపట్టకపోతే, అప్పుడు లబ్దిదారా, కాదా అనేది తేల్చడానికి ఇతర ఆప్షన్లు ఎంచుకుంటారు.
ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం.. ఫేషియల్ రికగ్నిషన్ విధానం బాగా పనిచేస్తుంది. దీని వల్ల నకిలీ వ్యక్తులు పెన్షన్ తీసుకోలేరు. 100 శాతం పారదర్శకత వస్తుంది అని అంటోంది. వేలిముద్ర (బయోమెట్రిక్) సమస్యకు ఇదే సరైన పరిష్కారం అంటోంది. ఇది ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానికి ఒక తేదీని ఆగస్టులో నిర్ణయిస్తారు. ఆ తేదీన దీన్ని ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లో ఒకేసారి ప్రారంభించాలి అని నిర్ణయించారు.

తెలంగాణలో 44 లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు ఉన్నారు. వారిలో ముసలివారు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు.. ఇలా చాలా రకాల వారు ఉన్నారు. దివ్యాంగులకు రూ.3వేలు, మిగతా వారికి రూ.2 వేలు చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. ముసలివారికి 57 ఏళ్లు వస్తే, పింఛను ఇస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ విధానం తెస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. అప్పటికి టెక్నికల్‌గా అంతా సిద్ధం కాకపోవచ్చని తెలుస్తోంది.

ఈ కొత్త విధానాన్ని ముందుగా.. పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ పొందుతున్న 23 లక్షల మందికి అమలు చేస్తారు. వారి కోసం యాప్ రెడీగా ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలో.. ఉద్యోగులకు ట్రైనింగ్ కూడా ఇచ్చేశారు. ఐతే.. జులై 27 వచ్చేసింది కాబట్టి.. ఆగస్టును వదిలేసి.. సెప్టెంబర్ నుంచి ఇచ్చే పెన్షన్‌కి దీన్ని వర్తింపజెయ్యాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ప్రజలకు ఒక అలర్ట్ ఉంది. వారు రెడీగా ఉండాలి. తమ ఆధార్ కార్డుల్లో ఫొటోలను స్పష్టంగా ఉండేలా చేసుకోవాలి. ఎందుకంటే.. ఇప్పుడు ఆ ఫొటోలే.. పెన్షన్ ఇచ్చేందుకు కీలకం కాబోతున్నాయి. లబ్దిదారులు పెన్షన్ కోసం పోస్టాఫీసుకి వెళ్లినప్పుడు.. ఫొటో తీసి.. ఆధార్‌తో పోల్చుతారు. రెండు ఫొటోలూ ఒకేలా ఉంటే.. కొత్తగా తీసిన ఫొటోని యాప్‌లో నమోదు చేసి పెన్షన్ ఇస్తారు.

ఒకవేళ ఆధార్‌లో ఉన్న ఫొటో, ఇప్పుడు తీసిన ఫొటో ఒకేలా లేకపోతే, యాప్ వాళ్లను లబ్దిదారుగా గుర్తించలేదు. దాంతో అది పెద్ద సమస్యగా మారగలదు. లబ్దిదారును గుర్తించేందుకు ఇతర మార్గాలను ఎంచుకుంటారు. అంటే బయో మెట్రిక్ విధానంలో వేలి ముద్ర తీసుకొని పెన్షన్ ఇస్తారు. కానీ వేలి ముద్ర పడకపోతే సమస్య కాగలదు. అందువల్ల లబ్దిదారులు.. తమ ఆధార్ ఫొటో అప్‌డేట్‌గా, స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. అలా లేకపోతే, వెంటనే అలా సరిచేయించుకోవడం మేలు. ఆధార్ కేంద్రాల్లో, మీ సేవా కేంద్రాల్లో ఈ పని చేయించుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe