ప్రభుత్వాన్ని టీ.ఎస్.ఎం.హెచ్.పి.ఎస్, సీఐటీయూ దళిత ప్రజాసంఘాల డిమాండ్.
BB6 TELUGU NEWS : 27-july-2025
(తెలంగాణ గళం) తాండూరు ఐసి రహమతుల్లా జూలై 26: శనివారం తాండూర్ పట్టణంలో తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ రోడ్ మార్గంలో మైనారిటీల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన 100 పడకల హాస్టల్ భవనాన్ని గతంలోనే కేటాయించినా, దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు దీనిని మైనారిటీ విద్యార్థుల కోసం వినియోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ప్రతి ఎన్నికల సమయంలో ఈ హాస్టల్ భవనాన్ని తాత్కాలికంగా ఎన్నికల ముందు పోలీస్ శాఖకు వినియోగించేందుకు కేటాయించడం జరిగింది. ఇది మైనార్టీల పట్ల అన్యాయంగా మారింది.ఇప్పుడు మళ్ళీ తాజా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా అట్టి హాస్టల్ భవనాన్ని మైనార్టీల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా, మెడికల్ కాలేజీకి కేటాయించినట్లు సమాచారం అందుతోంది. ఇది మైనార్టీల హక్కులను పూర్తిగా విస్మరించిన చర్యగా మేము భావిస్తున్నాం.
తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి తరఫున మేము ప్రభుత్వాన్ని బహిరంగంగా డిమాండ్ చేస్తూ, వెంటనే:తాండూర్ రాజీవ్ కాలనీలోని 100 పడకల హాస్టల్ భవనాన్ని మళ్లీ మైనారిటీ విద్యార్థుల అవసరాలకే కేటాయించాలి.
తక్షణమే మైనారిటీ విద్యార్థులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేందుకు హాస్టల్ ప్రారంభించాలి.
మైనారిటీలకు కల్పించాల్సిన విద్యా, వసతి హక్కుల్ని పరిరక్షించే చర్యలు తీసుకోవాలి.
ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే, మేము తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి, సీఐటీయూ, దళిత, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, టి ఎస్ ఎం హెచ్ పి ఎస్ తాండూర్ పట్టణ అధ్యక్షులు సాదిక్, ఎస్సీ ఎస్టి బిసి, హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కే. చెంద్రయ్య, మైనారిటీ నాయకులు అంజాద్, జాకీర్, ఎం ఆర్ పి ఎస్ తాండూర్ పట్టణ అధ్యక్షులు బలరాం, కార్యదర్శి రవి, దళిత నాయకుడు వై. రాములు. పాల్గొన్నారు.
మైనార్టీ విద్యార్థులకు హైదరాబాద్ రోడ్ మార్గంలో 100 పడకల హాస్టల్ భవనాన్ని మైనార్టీలకే కేటాయించాలి.

27
Jul