ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కి సిఎం శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి కోటి రూపాయల నగదు పురస్కారం

ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కి సిఎం శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

✅ పాతబస్తీకి చెందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డును అందుకున్నారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు.

✅ ప్రపంచ వేదికపై తెలుగు పాటకు ఖ్యాతిని తీసుకొచ్చిన రాహుల్ సిప్లిగంజ్ గారికి కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు.

✅ ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ గారి పేరును ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని చెప్పారు. ఆ మేరకు ఇవాళ పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe