పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ . హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన. BB6TELUGUNEWSCHANNEL : రాష్ట్రంలో రానున్న4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దాంతో పాటు బలమైన గాలులూ వీస్తాయని చెప్పింది. గంటకు 40కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు హైదరాబాద్లోనూ 2 రోజుల పాటువర్షాలు పడ్తాయని ఐఎండీ వెల్లడించి కాగా, గురువారం మధ్యాహ్నం 3.గంటలదాకా హైదరాబాద్ సిటీలో ఎండకొట్టినా.. హఠాత్తుగా మబ్బులు కమ్మేసింది.సిటీ అంతటా వర్షం దంచి కొట్టింది. ఇటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. మంచిర్యాల, ఖమ్మం,సూర్యాపేట, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి,సిద్దిపేట, వికారాబాద్, హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్,జనగామ, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాఉప్పల్ 8.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వేంసూరులో 8.3సెంటీ మీటర్లు, మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లిలో 7.9, మేడ్చల్ జిల్లా నాచారంలో 7.8, మెట్టుగూడలో 6.9,ఖమ్మం జిల్లా మధిరలో 6.7, యాదాద్రి జిల్లా నారాయణపూర్ 6.4, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో 6.1 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో రానున్న 4 రోజులు వానలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త ..మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్తాయన్న ఐఎండీ.

18
Jul