మెదక్ జిల్లా కాంగ్రెస్ SC సెల్ జిల్లా సెక్రటరీఅనిల్ అనుమానాస్పద మృతి

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. రిగుంతం గ్రామ శివారులో మెదక్- హైదరాబాద్ రోడ్డుపక్కన అనిల్ (45) మృతదేహంతో పాటు కారు అదుపు తప్పి ఉంది.ముందుగా అందరూ రోడ్డు ప్రమాదం అనుకున్నారు. అయితే ఘటనా స్థలంలో రెండు బుల్లెట్లు లభ్యం కావడంతో పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అనిల్ కారు కల్వర్ట్ ను ఢీ కొట్టడం,ఘటనా స్థలంలో బుల్లెట్లు ఉండటం కలకలం రేపుతోంది. ఎవరైనా అతడిని కాల్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా లేక, అతనే ఆత్మహత్య చేసుకున్నాడా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యానా.? ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe