ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం రేవంత్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.

లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి గారు అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.

ఈ ప్రత్యేక పూజల సందర్భంగా మంత్రులు కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, హర్కర వేణుగోపాల్ రావు గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసనసభ్యులు దానం నాగేందర్ గారు, శ్రీగణేశ్ గారు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe