మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రాశ్యధిపతి కుజుడు పంచమంలో, లాభంలో రాహువు, ధన స్థానంలో శుక్రుడు సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో సమస్యలు, ఒత్తిళ్లు, విమర్శలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో ఉండడం, ధన స్థానంలో గురువు, లాభ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగి పోతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గురువు ఇదే రాశిలో ఉండడం, రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశిలో బుధుడు, ధన స్థానంలో కుజుడు, లాభ స్థానంలో శుక్రుడు ఉన్నందువల్ల రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండక పోవచ్చు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి లాభ స్థానంలో గురువుతో కలిసి ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సవ్యంగా నెరవేరుతాయి. నిరుద్యోగులకు సమయం బాగానే ఉంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానేఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో, గురు, రవులు దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు మిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాశ్యధిపతి శుక్రుడితో సహా, గురు, రవి, బుధ, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో, భాగ్య స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగ జీవితంలో పదవీ యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువు సప్తమంలో, భాగ్యస్థానంలో కుజుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. సామాజికంగా కూడా స్థితి, స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రాశ్యధిపతి శని తృతీయంలో, శుక్రుడు పంచమంలో, బుధుడు సప్తమంలో ఉండడం వల్ల ఆదా యం పెరిగి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. చిన్నాచితకా కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం బాగా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురువు సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిత్రులకు సహాయపడ తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు చతుర్థంలో, తృతీయాధిపతి శుక్రుడు తృతీయంలో ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందు తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
Horoscope Today: వారి ఆదాయానికి లోటుండక పోవచ్చు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

12
Jul