ముంబై: మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే పప్పు క్వాలిటీ బాలేదని క్యాంటీన్ నిర్వాహకుడి చెంప చెళ్లు మనిపించాడు. పిడి గుద్దులతో ముఖం పగలగొట్టాడు. పైగా తాను అలా ప్రవర్తించడంతో తప్పే లేదని ఈ ఘటన జరిగిన తర్వాత తనను తాను సమర్థించుకున్నాడు. ఈ ఘటన ముంబైలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ముంబై చర్చ్ గేట్ ప్రాంతంలోని ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్లో ఈఘటన జరిగింది. క్యాంటీన్ ఆపరేటర్లు ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి ఇంత దురుసుగా ప్రవర్తించడంపై నెటిజన్లు మండి పడుతున్నారు.
పప్పు వాసన చూపించి మరీ..పొట్టుపొట్టు కొట్టిన ఎమ్మెల్యే..viral video

09
Jul