ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తను గొంతు పిసికి చంపేసిన భార్య

నారాయణపేట మండల కేంద్రం కోటకొండ గ్రామానికి చెందిన కంపిలి అంజిలప్ప(32), రాధ దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహం జరగగా, వీరికి ఇద్దరు పిల్లలు

బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ముంబైకి వెళ్లి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా, అక్కడే పనిచేస్తున్న ధన్వాడ మండలానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాధ

విషయం తెలుసుకొని స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఊరికి వెళ్తే పరువు పోతుందని వేరే చోట పని చేసుకుందామని భర్తను అడిగిన భార్య

దీంతో హైదరాబాద్ – బాచుపల్లిలోని ఒక అపార్టుమెంటులో పని చేస్తూ గుడిసెలో నివాసం ఉంటున్న దంపతులు

తిరిగి ఆ యువకుడితో మాట్లాడుతుందని గమనించి, భార్యతో గొడవకు దిగిన భర్త అంజిలప్ప

దీంతో గత నెల 23వ తేదీన మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి చంపేసి, భర్త వేధిస్తున్నాడని పక్కింట్లో నిద్రించిన రాధ

ఉదయం లేచి గుడిసెలోకి వెళ్లి భర్త చనిపోయి ఉన్నాడని రోదిస్తూ బయటకు వచ్చిన రాధ

రాధపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన అంజిలప్ప కుటుంబ సభ్యులు

సీసీ కెమెరాల ఆధారంగా రాధను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకుందని నిర్ధారించిన పోలీసులు

తండ్రి మరణించి, తల్లి జైలుకు వెళ్లడంతో అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe