వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని.. దాని కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యతని సిఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: మూడు రంగుల జెండా చేతబూని కల్వకుంట్ల గడీని బద్దలు కొట్టామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్పారు. ఎల్బీస్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ (Congress) సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని.. మహిళలకు రిజర్వేషన్లు అమలుకానున్నాయని చెప్పారు. కార్యకర్తలకు అన్ని పదవులుదక్కే వరకూ విశ్రాంతి తీసుకోబోనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారం వస్తామని.. దాని కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యతని చెప్పారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఒడిదొడుకులు అధిగమించి ముందుకెళ్తున్నాం”కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని.. ఈ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని కొందరు అన్నారు. కానీ..
ఒడిదొడుకులు అధిగమించి ముందుకెళ్తున్నాం“కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని.. ఈ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని కొందరు అన్నారు. కానీ..పార్టీ నేతలంతా ఐకమత్యంతో పనిచేస్తూ ఆఅపోహలను పటాపంచలు చేశారు. జనగణనతో పాటు కులగణన.. ఎస్సీ వర్గీకరణ చేస్తామని గతంలో రాహుల్ గాంధీ మాటిచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే ఏడాదిలోపే కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం.18 నెలల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ మోడల్ ఆవిష్కరించాం. కష్టాలు, ఒడిదొడుకులు వచ్చాయి.. అన్నీ అధిగమించి ముందుకెళ్తున్నాం.
చర్చకు ఎవరొస్తారో రండి..
రైతుల కోసం 18 నెలల్లో రూ.1.04 లక్షల కోట్లు ఖర్చుచేశాం. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని గత సీఎం చెప్పారు.. 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి దేశానికే ఆదర్శంగా నిలిచాం. రైతుభరోసాలోప్రభుత్వం విఫలమవుతుందని కొందరు ఎదురు చూశారు.. కానీ వారి ఆశ నెరవేరలేదు. రైతు రాజ్యం ఎవరు తెచ్చారో.. ఎక్కడైనా చర్చ చేసేందుకు సిద్ధం.చర్చకు ఎవరొస్తారో రండి.. కేసీఆర్, మోదీ, కిషన్‌రెడ్డి ఇలా ఎవరొచ్చినా సరే. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా.. పేర ఎప్పుడూ బర్రెలు, గొర్రెలు మేపుతూనే బతకాలా? మేం తొలి ఏడాదిలోనే 60 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్, మోదీకి సవాల్ విసురుతున్నా. లెక్కకావాలంటే చెప్పండి.. అందర్నీ తీసుకొచ్చి స్టేడియంలోనిలబెట్టి లెక్కవేయిస్తా. 60వేలకు ఒక్కరు తక్కువ వచ్చినా కాళ్లు మొక్కి తప్పుకొంటా” అని రేవంత్రెడ్డి అన్నారు.

అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు. “44లక్షల మంది రైతులకు రూ. 2,180 కోట్లతో బీమా చేశాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12వేలు ఇస్తున్నాం. రైతుభరోసా ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశాం.చేయూత పథకం ద్వారా రూ. 17వేల కోట్లు పంపిణీచేశాం. పేదలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం”అని చెప్పారు.