వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం మరియు కులక్చర్ల పోలీసుల ఆధ్వర్యంలో వివేకానంద స్కూల్ అండ్ కాలేజ్ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భాగంగా కులక్చర్ల ఎస్సై రమేష్ కుమార్ మాట్లాడుతూ “జీవితంలో ఉన్నతంగా జీవిస్తూ, మీ కుటుంబానికి అండగా ఉంటూ, సమాజానికి మేలు చేయాలనుకనే మీలాంటి యువతకు, అవరోధంగా లేదా అడ్డుపడే నాలుగు అంశాల గురించి” విద్యార్థి విద్యార్థులకు అవగాహన చేయడం జరిగినది.
అందులో ఒకటి ప్రేమ, రెండు బాల్య వివాహాలు, మూడు పోక్సో కేసులు మరియు నాలుగు మత్తుపదార్తాలకు బానిస కావడం.
విద్యార్థినీ విద్యార్థులు ఎవరు కూడా ఈ వయసులో ప్రేమ జోలికి వెళ్లకుండా ఉపాధ్యాయులు చెప్పినా పాటలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని బుద్ధిగా చదువుకోవాలని సూచించారు.
అలాగే ప్రేమ అనే ముసుగులో పడకుండా, యుక్త వయస్సు రాకుండానే వెల్లిపోయి ఎవరికి తెలియకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వలన మీ జీవితాన్ని స్వయంగా మీరే నాశనం చంసుకుంటున్నారని, అలాంటి వారిపై ఫోక్సో కేసులు నమోదు చేసి చట్టపరమైన శిక్షలు వేయిస్తున్నామని హెచ్టరించారు.
అలాగే మీకు తెలిసిన వారిలో ఎవరికైనా బాల్య వివాహం చేయదలుస్తుంటే వెంటనే 1098 కి కాల్ చేసి వివరాలు తెలుపవలసిందిగా కోరారు.
అలాగే మద్యపానం మరియు డ్రగ్స్ కి అలవాటు పడకుండా బాగా చదువుకొని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని, అలాగే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నతంగా ఎదగాలని సూచించారు.
కుల్కచర్ల లో ప్రేమ, బాల్య వివాహాలు, పోక్సో, మత్తుపదార్తాల పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

02
Jul