హైదరాబాద్: చారిత్రాత్మక గోల్కొండకోటలో ఈ నెల 26వ తేదీ నుంచి ఆషాడబోనాల ఉత్స వాలు మొదలయ్యాయి.ఇందులో భాగంగా రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో ఇవాళ తెల్లవారు జాము నుంచే భక్తులు గోల్కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. గొల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ప్రతి గురు,ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు. అమ్మవార్లకు 9పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ కోటాలో మొదలైన బోనాలు జులై 24న తిరిగి గోల్కొండ కోటలో వేడుకలు ముగియనున్నాయి.
గోల్కొండకు పోటెత్తిన భక్తులు అమ్మవారికి రెండో బోనం

30
Jun