BB6 TELUGU NEWS CHANNEL : సూర్యాపేట: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతిచెందగా.. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులువెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామునఈ ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లాఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్, కానిస్టేబుల్ బ్లెస్సిన్ మృతిచెందారు. మరో పోలీసులకు గాయాలు కావడంతో వారినికోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులుహైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. దుర్గాపురం వద్దకు రాగానేఒక్కసారిగా లారీ అదుపు తప్పి పోలీసులు ప్రయాణిస్తున్నుకారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగంనుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాద సమయంలో కారులోకిఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కారులో ముందు కూర్చోవడంతో ఎస్ అశోక్, డ్రై 1చేస్తున్న కానిస్టేబుల్ బ్లెస్సిన్ చనిపోయారు. ఇదిలా ఉండగా..
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా. మరో ఇద్దరు పోలీసులకు గాయాలు

26
Jun