MEPA మెపా ( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) రంగారెడ్డి జిల్లా, జిల్లేడుచౌదరిగూడ
మండల అధ్యక్షుడిగా సింగరమోని శివకుమార్ ముదిరాజ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు దారమోని సురేష్ ముదిరాజ్ తెలిపారు.ఈ సందర్భంగా సురేష్ ముదిరాజ్ మాట్లాడుతూ..విద్య ఉద్యోగ సాధికారత కోసం మెపా ను స్థాపించిన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ గారి ఆలోచనలు , ఆశయాలను అనుసరించి సూర్యాపేట జిల్లా లో ముదిరాజ్ ల ఐక్యత కోసం కృషి చేస్తామని అన్ని మండల కమిటీ లు వేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతామని,నూతనంగా ఎన్నికైన సింగరమోని శివకుమార్ ముదిరాజ్ కు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జిల్లేడు చౌదరిగూడ మండల మెపా నూతన అధ్యక్షులు శివకుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ ఎన్నికకు సహకరించిన మెపా వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ కు,ప్రధాన కార్యదర్శి బొట్లపల్లి సంజీవన్ కుమార్ ముదిరాజ్ కు,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దారమోని సురేష్ ముదిరాజ్,రాష్ట్ర,జిల్లా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు…
MEPA మెపా జిల్లేడుచౌదరిగూడ మండల అధ్యక్షులుగా సింగరమోని శివకుమార్ ముదిరాజ్ నియామకం_ నియామకం చేసిన జిల్లా అధ్యక్షులు దారమోని సురేష్ ముదిరాజ్.

19
Jun