మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో నూతన గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్: మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహమ్మద్ బాబర్ (బాబ్రీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాబ్రీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన హృదయమని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ప్రజా శ్రేయస్సు కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, యువతను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈవీఎం హటావో – దేశ్ కో బచావో అనే నినాదంతో సుప్రీంకోర్టు న్యాయవాదులు పోరాడుతున్నారని, రాహుల్ గాంధీకి పూర్తి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని యువత ఉత్సాహం చూపుతున్నారని అన్నారు.

అందుకు తాను చలించి కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకంతో నిరంతరం ప్రజల్లో ఉంటూ, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తల అనుభవాలను తీసుకుంటూ పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, పరిగి శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రయోజనాల కోసం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా తమ గ్రామం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలందరం కలిసి పనిచేస్తామని మాట ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ భగవంత్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బెక్కర్ మధుసూదన్ రెడ్డి, సంజీవ్ గుప్తా, డీసీసీ జనరల్ సెక్రెటరీ వెంకటేష్, డీసీసీ జాయింట్ సెక్రెటరీ, మండల ప్రధాన కార్యదర్శి ఆశిరెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ గుముడాల చెన్నయ్య, వార్డు సభ్యులు కుమ్మరి సత్యమ్మ, హస్నాబాద్ చంద్రయ్య, చీకటి నాగరాజు, మోర హనుమంతు, కాంగ్రెస్ యువ నాయకులు కమ్మరి రాజు, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.