BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండలం చెలిమిల్లా గ్రామ పంచాయతీ పరిధిలోని జిన్నారం గ్రామ ఉప సర్పంచ్ కీర్తిశేషులు ఈడిగి వెంకటయ్య గౌడ్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న గండీడ్ మండల ఉప సర్పంచులు వెంటనే స్పందించారు. మృతుని భౌతికదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చివరి వరకు అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో గండీడ్ గ్రామ ఉప సర్పంచ్ గుముడాల చెన్నయ్య, వెన్నచేడ్ గ్రామ ఉప సర్పంచ్ రవికాంత్ రెడ్డి, కొంరెడ్డిపల్లి ఉప సర్పంచ్ బీమయ్య, కాప్లాపూర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్, చిన్నవార్వాల్ ఉప సర్పంచ్ రాములు, ఆశిరెడ్డిపల్లి ఉప సర్పంచ్ హన్మంతు, జనంపల్లి ఉప సర్పంచ్ ఎరుకల కృష్ణయ్య, జిన్నారం తండా ఉప సర్పంచ్ బీమిబాయి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గండీడ్ మండల ఉప సర్పంచుల మానవత్వం… మృతి చెందిన ఉప సర్పంచ్ కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం
25
Sep