పరిశుభ్రతే నిజమైన సేవ… ప్రధాని ఆశయాలకు అనుగుణంగా గండీడ్ మండల బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

వెన్నచేడ్ సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా ‘స్వచ్ఛభారత్’

సేవా సంకల్ప యాత్రలో భాగంగా బిజెపి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమం


BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని వెన్నచెడ్ గ్రామంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గండీడ్ మండల బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన నెల రోజుల “సేవా సంకల్ప యాత్ర” లో భాగంగా బుధవారం గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయ ప్రాంగణంలో “స్వచ్ఛభారత్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు కె. విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో, కార్యక్రమ కన్వీనర్ నరహరి రెడ్డి, కో-కన్వీనర్ బద్రిశ్వర్ల ఆధ్వర్యంలో ఈ పారిశుధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ… గ్రామాలు, దేవాలయాల పరిశుభ్రతే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. పరిశుభ్రతే నిజమైన సేవ అని, ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు గడ్డమీది మల్కయ్య, రాజు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చాకలి బాలయ్య, మండల సీనియర్ నాయకులు పటేల్ గోపాల్, వెంకట్ రెడ్డి, జ్ఞానేశ్వర్, శివ, నరేష్, నవీన్, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు మోదీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పాల్గొన్న వారందరికీ భోజన సౌకర్యం కల్పించారు.

Related News

గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్న బిజెపి నాయకులు కార్యకర్తలు