BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మార్వోని వెన్నచెడ్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత్ చెన్నయ్య శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు – ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ యాసిన్, జీపీఓ శ్రీనివాస్, వార్డు సభ్యులు మేకల సాయిలు , పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ అల్గారి రామ్ రెడ్డి , పెద్దాపురం చెన్నయ్య మరియు గ్రామ పెద్దలు పాల్గొని నూతన ఎమ్మార్వో కు శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన ఎమ్మార్వో సేవలు మండల ప్రజలకు మరింత చేరువై, గండీడ్ మండల అభివృద్ధికి విశేషంగా దోహదపడాలని అందరూ ఆకాంక్షించారు.
గండీడ్ మండల నూతన ఎమ్మార్వో గారకి ఘన సన్మానం
06
Aug