సినీ కార్మికుల వేతన పెంపునకు అంగీకారం కుదరడంపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) సంతోషం వ్యక్తం చేశారు.

BB6 TELUGU NEWS CHANNEL
Megastar Chiranjeevi…
ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా, ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు తీసుకొంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ ను దేశానికే కాదు, ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్ గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి.
తెలుగు చిత్రసీమ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలని, ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా.