గండీడ్ మండల ఆర్.ఐ కి మెమోరండం ఇచ్చిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు

BB6 TELUGU NEWS :  23-7-2025 
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం ఉద్యోగ,ఉపాధ్యాయ, విద్యారంగ పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( USPC ) మూడు దశల పోరాటంలో  భాగంగా ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా TSUTF గండీడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో  మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ (RIO) గారికి మెమోరండం సమర్పించడమైనది‌. మండల అధ్యక్షులు గంట శ్రీనివాస్, మరియు ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య మాట్లాడుతూ అన్ని క్యాడర్ల బదిలీలు పదోన్నతులు షెడ్యూల్ తక్షణమే విడుదల చేయాలి గెజిటెడ్ హెడ్మాస్టర్ స్కూల్ అసిస్టెంట్ ప్రైమరీ హెడ్మాస్టర్ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చెయ్యాలి జీవో నెంబర్ 25ను సవరించాలి ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి 40 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలో తరగతికొక టీచర్ ఉండాలి ఉన్నత పాఠశాల సబ్జెక్టు వర్కులోడుకు అనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలి అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల పెన్షన్  బెనిఫిట్స్ విడుదల చేయాలి సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాల జీతాన్ని వెంటనే చెల్లించాలి సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను బేసిక్ పే అమలు చేయాలి మోడల్ స్కూల్స్ గురుకుల సిబ్బందికి 010 ద్వారా వేతనాలు చెల్లించాలి జీవో 317 కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలి గురుకుల పాఠశాలలో టైం టేబుల్ శాస్త్రీయంగా సవరించి విద్యార్థులు ఉపాధ్యాయులకు అనుకూలంగా మార్పు చేయాలి పైన పేర్కొన్న డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని అని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టి.ఎస్.యు.టి.ఎఫ్ మండల అధ్యక్షులు గంట శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, సీనియర్ నాయకులు లావుడ్యా సేవియా,మండల ఉపాధ్యక్షులు  అంకిల్ల గోవిందు, కోశాధికారి  కె.వెంకటయ్య, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe