Breaking News : సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్‌ భార్య ఘన విజయం…

BB6 TELUGU NEWS CHANNEL
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన గీతాంజలి భర్తను కాంగ్రెస్‌ నేతలు కక్షగట్టి సస్పెండ్‌ చేయించారు.

కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబు ల్‌గా పనిచేస్తున్న కమలాపురం రమేశ్‌ బీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేస్తున్నాడంటూను కొందరు కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేసి సస్పెండ్‌ చేయించారు.

కానీ, వార్డు ప్రజలు మాత్రం పోలీస్‌ భార్య కమలాపురం గీతాంజలిని అక్కున చేర్చుకుని 223 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తేజపై గీతాంజలి ఘన విజయం సాధించారు.

కాంగ్రెస్‌ అభ్యర్థికి 397 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గీతాంజలికి 620 ఓట్లు వచ్చాయి. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఓటర్లు మాత్రం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఆదరించారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe