BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుపొందిన క్రమంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈక్రమంలో శుక్రవారం (ఫిబ్రవరి 13 )నిజామాబాద్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయని.. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో 75 శాతం స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని అన్నారు.
మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలు మళ్ళీ ఈ ఎన్నికల్లోనూ గెలిపించారని..మంత్రులు, నేతలు,కార్యకర్తల కృషితో 75 శాతం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని అన్నారు. ప్రతిపక్షంఎన్ని విమర్శలు, వెటకారాలు మాట్లాడిన ప్రజలు కాంగ్రెస్ ని ఆదరించారని అన్నారు. బిజెపి, బిఅరెస్, ఇంకా అన్నీ పార్టీలు కలిసి కనీసం 25 శాతం కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు మహేష్ కుమార్ గౌడ్. నిజమాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి బిజెపి, ఎంఐఎం పార్టీలు లబ్ధిపొందాయని అన్నారు.
సీఎం రేవంత్, మంత్రులు కలిసి ప్రజల కోరికలు నెరవేర్చేలా పాలిస్తున్నామని అన్నారు. సన్నబియ్యం, ఉచిత బస్సు,కరెంట్ ప్రజలకు అందుతున్నాయని.. వచ్చే జీహెచ్ఎంసి ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జరిగే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా గెలుస్తాంమని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారంలోకి వస్తామని.. నిజమాబాద్ కార్పొరేషన్ లో 28 సీట్లు గెలుస్తామని ఆశించాం.. కానీ అలా జరగలేదని అన్నారు. ఎన్నికల్లో ఎంఐఎంకి దూరంగా ఉన్నామని.. అభివృద్ధి కోసం ఏదయినా కఠిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్.
75 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
13
Feb