జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిలా తాండూరు : తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో “జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశంలో “పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా స్థాయి పదవుల కోసం అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పార్టీ కోసం అంకిత భావంతో పని చేయాలన్నారు.పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కష్టపడి పని చేయాలన్నారు.అర్హులైన వారికి పదవులు సమయాను కూలంగా వస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత. డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి. డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్. మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు. నాయకులు అబ్దుల్ రవూఫ్. లొంక నర్సింలు. మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్. రాము. వివిధ మండలాల నాయకులు. కార్యకర్తలు ఉన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe