ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు మాయం

BB6 TELUGU NEWS CHANNEL
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు మాయం

ధరలు పెరగడంతో పెట్టలేకపోతున్నామని మధ్యాహ్న భోజన కార్మికుల ఆవేదన

తెలంగాణ వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు రూ.8 నుండి రూ.8.50 ఉండగా, కేవలం రూ.6 మాత్రమే చెల్లిస్తూ, కొన్ని ప్రాంతాల్లో అవి కూడా చెల్లించని ప్రభుత్వం

దీంతో పిల్లలకు సొంత డబ్బులతో కోడి గుడ్లు కొని పెడుతున్నామని, ఇప్పుడు ధరలు పెరిగినందున పెట్టలేకపోతున్నామని వాపోతున్న వంట కార్మికులు

వంట సామాన్ల ధరలు పెరిగినా ప్రభుత్వం పాత ధరలకు అనుగుణంగానే తమకు బిల్లులు చెల్లిస్తుందని, ఇటీవల అవి కూడా చెల్లించకపోవడంతో విద్యా డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగామని మధ్యాహ్న భోజన కార్మికుల ఆవేదన

ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని ప్రగల్భాలు పలికినా, 3–4 నెలల నుండి బిల్లులు రావడం లేదని, పిల్లలకు భోజనం పెట్టేందుకు తాము అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe