మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో అందే శ్రీ చిత్రపటానికి ఘనంగా* *నివాళులర్పించిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు..
అందెశ్రీ వరంగల్ జిల్లా జనగాం వద్ద రేబర్తి గ్రామంలో జన్మించారు. ఇతని అసలు పేరు అందే ఎల్లయ్య తల్లిదండ్రులు లేని తన బాల్యం పశువుల కోట్టంలో మొదలైంది. బుక్కెడు బువ్వ కోసం పశువుల కాపరిగా కూలీగా పనిచేశారు దీనితో ఆయన విద్యకు దూరమయ్యారు. కానీ ప్రకృతిని గురువుగా తీసుకొని పక్షుల కిలకిల రావాలు పైర గాలులు, మట్టి వాసనలు, పొలాల సోయగాలు, ఆయన మనసుకు స్ఫూర్తిగా మారాయి. చిన్నప్పటి నుంచి ఆయన హృదయం ప్రజల కష్టాల పైన స్పందించేది. సాధారణ జీవన నేపథ్యం కలిగిన అందేశ్రీ కవిత్వం తెలంగాణ ఆత్మను ప్రతిబింబించింది. ప్రజల కష్టాలు రైతుల బాధలు మహిళల వేదనలు కార్మికుల పోరాటాలు ఇవన్నీ అతని కవితలో సజీవంగా కనిపించేవి. తెలంగాణ ఉద్యమంలో ఇతని పాటలు ఉద్యమానికి ఊపిరిగా మారాయి.జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతం గా మారి కోట్లాది తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు. 2015 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాశరథి సాహితి పురస్కారంతో గౌరవించింది. ఈరోజు 2025 నవంబర్ 10 తారీకు రోజు తుది శ్వాస విడిచారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.