నవీన్ యాదవ్ ఊరేగింపు పై BRS చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాలు.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్

BB6 TELUGU NEWS
మొన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసారు.. నవీన్ యాదవ్ ఊరేగింపు అంతర్ రాష్ట్ర రౌడీ మూకల ప్రదర్శన మాదిరిగా జరిగిందని..నగరంలో ఉన్న రౌడీలందరూ ఒక చోట చేరి ప్రదర్శన పేరుతో కత్తులు కటార్లతో హంగామా చేశారని విమర్శించారు…!

ఇపుడు బీ ఆర్ ఎస్ విషయానికి వద్దాం..!

హైదరాబాద్ యూత్ కరేజ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి దాడులు దౌర్జన్యాలు రెచ్చగొట్టే ప్రసంగాలతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఈరోజు బీ ఆర్ ఎస్ లో చేరాడు..!

స్వయంగా కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
పోక్సో కేసు సహా ఇరవై ఐదు కేసులు ఉన్న నిందితుడిని.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తిని ఎలా చేర్చుకున్నారు..

శాంతి భద్రతల విషయంలో.. కాంగ్రెస్ అభ్యర్థి.. తమ ప్రధాన ప్రత్యర్థి నవీన్ యాదవ్ పై ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ సహా గులాబీ ముఖ్యులు సల్మాన్ ఖాన్ చేరికపై ఏమని సమాధానం చెప్తారు..

నగరంలో శాంతి భద్రతలు మా హయాంలో గొప్పగా ఉండేవి అని చెప్పుకున్న కేటీఆర్… వారి ప్రభుత్వ హయంలోనే అనేక అరాచక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవాల్సిన గత్యంతరం ఏమొచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది..

సల్మాన్ ను చేర్చుకోవడం వల్ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కలిసివస్తుందో రాదో తెలియదు కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయ్యింది..!

ఇది ఆ పార్టీ నేతలు చెబుతున్నదే..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe