గండీడ్ మండల కేంద్రంలో ఘనంగా కొమురం భీమ్ 124 వ జయంతి

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో కొమురం భీమ్ 1901 సంవత్సరం అక్టోబర్ 22 తారీకు రోజు ఆదిలాబాద్ జిల్లాలోని సంకేపల్లి గ్రామంలో గిరిజన గోండు జాతికి చెందిన చిన్ను సోంబాయి దంపతులకు జన్మించాడు 15 ఏళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కొమరం భీం కుటుంబం కరిమేర ప్రాంతంలోని సర్దపూర్ ప్రాంతానికి వలస వెళ్లింది. నిజం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని అన్ని రకాల నిజాం ప్రభుత్వం అధికారాలను తోషిపుచ్చాడు పశువుల కాపరులపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా తమ భూమిలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ భూమి అడవి నీరు మాదే అనే నినాదంతో ఉద్యమించాడు మనదేశంలో ఆదివాసుల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి ఆదివాసి ఆత్మగౌరవ పత్రిక కొమురం భీమ్, స్వయం పాలన ఆస్తిత్వ ఉద్యమాలకు వేగుచుక్క ఆయన గౌరవార్త తెలంగాణలో ఒక జిల్లాకు కొమరం భీమ్ ఆశిఫాబాద్ జిల్లాగా నామకరణం చేశారు చివరిగా 1940 అక్టోబర్ 27న చనిపోయాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య  గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హస్నాబాద్ వెంకటయ్య, కొండారెడ్డి, చిట్లపల్లి నాగేష్,  చంద్రయ్య, మెకానిక్ వెంకటేష్, ఆడివయ్య,  పెద్ద నర్సయ్య, నరేందర్, చిన్న చెన్నయ్య,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe