సర్కార్కు రూ.2,700 కోట్ల ఆదాయం.. వైన్స్ అప్లికేషన్లు లక్ష లోపే!

శనివారం అర్ధరాత్రి వరకు 86 వేల అప్లికేషన్లు,

దరఖాస్తులకు గడువు పొడిగింపు..ఈ నెల 23 వరకు చాన్స్

27న లక్కీ డ్రా.. బీసీ బంద్,బ్యాంకులకు సెలవులతో

గడువు పెంచుతున్నట్టు అధికారుల వెల్లడి

BB6 TELUGU NEWS CHANNEL
ఈ సారి వైన్స్ అప్లికేషన్లు తగ్గాయి. 2023లో 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి లక్ష లోపే వచ్చాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి ఈ నెల18 వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం రాత్రి 11 గంటల వరకు 86 వేల అప్లికేషన్లు వచ్చాయి.అయితే ఇంకా చాలా మంది అప్లికేషన్లు ఇచ్చేందుకు క్యూ లైన్లో ఉండటంతో ఈసంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. దాదాపు 90 వేల నుంచి 95 వేల వరకు అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక వేళ90 వేల పైన అప్లికేషన్లు దాటితే ప్రభుత్వఖజానాకు దరఖాస్తుల ద్వారానే రూ.2,700 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఒక్కో వైన్స్ కు వందల్లో అప్లికేషన్లు వచ్చాయి.

కూడబలుక్కుని అప్లికేషన్లు..ఎలాగైనా వైన్స్ ను దక్కించుకోవాలని భావించిన కొందరు.. వారి ప్రాంతాల్లో 10మంది కలిసి రెండు, మూడు మద్యందు కాణాలకు అప్లికేషన్లు సమర్పించారు.మంత్రులు, ఎమ్మెల్యేలు వారి దగ్గరి బంధువులతో ఎక్కువ అప్లికేషన్లు వేయించారు. రియల్ట్బర్లు.. ఇప్పటికే వైన్లు నిర్వహిస్తున్నోళ్లు కూడా రకరకాలుగా అప్లికేషన్లు వేశారు. ఎక్కడో ఒక చోట తమకు అదృష్టం కలిసిరాక పోతుందా అనిభావించి చాలామంది రెండు, మూడు అప్లికేషన్లు వేశారు.

27న లక్కీ డ్రా..

ఈ నెల 27న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. 2025 డిసెంబర్ 1నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేండ్ల కాలానికి ఎక్సెజ్ శాఖ కొత్తలైసెన్సులు జారీ చేయనుంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 దుకాణాల్లో గూడ్స్ కు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు131 చొప్పున కేటాయించారు. వైన్స్ దక్కించుకున్నోళ్లు ఈ నెల 25 వరకు లైసెన్స్ ఫీజులో ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ చేల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 30నుంచి కొత్త దుకాణాలకు స్టాక్ రిలీజ్చేస్తారు. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.

గతం కంటే తగ్గినయ్..రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్స్ ఉన్నాయి.ఒక్క అప్లికేషన్ కు రూ.3 లక్షల ఫీజు తీసుకున్నారు. ఇది నాన్ రెఫండబుల్ .2023లో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 1.31లక్షలుగా ఉన్నది. దీంతో ఈసారి దాదాపు 40 వేల అప్లికేషన్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అంతకుముందు మద్యం పాలసీ 2021లో 67,849 అప్లికేషన్లు వచ్చాయి. ఫీజు రూ.లక్ష పెంచడంతో ఈసారి అప్లికేషన్లు తగ్గినా,ఆదాయం పోయిన సారి అంతే వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు దీనికి తోడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా వస్తుంది. ఈ మొత్తం కూడా కలిపితే ఆదాయం ఇంకింత పెరగనుంది. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 40 అప్లికేషన్లు వచ్చాయి. గతంలో ఏపీ సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువ అప్లికేషన్లు రాగా ఈసారి తగ్గింది. పైగా ఇంతకుముందు ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వమే వైన్స్ లను నిర్వహించింది. ఈసారి కూడా అక్కడ వైన్స్ లకు తెలంగాణ మాదిరి అప్లికేషన్ల సిస్టమ్ పెట్టడంతో ఏపీ వ్యాపారులు అక్కడే అప్లికేషన్లు వేశారు.దీంతో తెలంగాణలో ఈసారి అప్లికేషన్ల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. అప్లికేషన్ ఫీజు పెంచడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. సరూర్ నగర్, శంషాబాద్, నల్గొండ, మేడ్చల్ లో ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాలలో తక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe