నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో జడ్పిటిసి ఎంపిటిసి ఓటర్ లిస్ట్ విడుదల..

BB6 TELUGU  NEWS : ఉబ్బని శేఖర్ : నార్కెట్పల్లి మండలంలోని ఎంపీడీవో ఉమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపిటిసి జడ్పిటిసి ఓటర్ లిస్టు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి స్థానాలను, అమ్మనబోలు, పల్లెపాడు,అక్కనపల్లి, నక్కలపల్లి,చిన్న తుమ్మల గూడెం, తొండలవాయి,నెమ్మని ఏపీ లింగోటం నార్కట్పల్లి 1,నార్కట్పల్లి 2, నార్కట్పల్లి 3,ఔరవేణి, బి విల్లెంల, చెరువుగట్టు, ఎల్లారెడ్డిగూడెం, అన్ని గ్రామాల వారిగా పురుషుల సంఖ్య :21508, స్త్రీలు:22263, అదర్స్ :1, మొత్తం సంఖ్య 43772, ఉన్నారని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జేరిపోతుల భరత్,  BRS పార్టీ యువజన నాయకుడు  పుల్లెంల వెంకట్ గౌడ్, మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe