ఇవాళ(సెప్టెంబర్ 7)సంపూర్ణ చంద్రగ్రహణం…ఏ దేశాలలో కనిపిస్తుంది అంటే.?

BB6 TELUGU NEWS CHANNEL
ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.ఇది 82 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు చూడొచ్చని.. ఆసియా, ఆస్ట్రేలియా,యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

దీన్ని చూసేందుకు ఎలాంటి అద్దాలు అవసరం లేదని చెప్పారు. ఇక మనదేశంలో చాలా ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని వెల్లడించారు. “ఆదివారంరాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 గంటల వరకు సంపూర్ణ
చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం
తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది” అని
పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe