తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆత్మగౌరవానికి, ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియాలో కొత్తగా నిర్మించిన హాస్టల భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉద్వేగభరితంగా మాట్లాడారు. తెలంగాణ అనే పదానికి ఈ యూనివర్శిటీ ప్రత్యామ్నాయంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఈ యూనివర్సిటీ చారిత్రక ప్రాముఖ్యతను తిరిగి ఆవిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 1938లో సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు, ఈ యూనివర్సిటీ ప్రతి సమస్యకూ చర్చా వేదికగా నిలిచిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గిన సమయంలో కూడా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ జ్వాలను ముందుకు తీసుకెళ్లారన్నారు. శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వంటి విద్యార్థులు తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. ఈ యూనివర్శిటీ గడ్డ దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి వంటి మేధావులను అందించిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ ఉస్మానియా కళా విహీనంగా మారిన పరిస్థితి ఏర్పడింది.. కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు.. చైతన్యం అందించిన ఓయూను కాలగర్భంలో కలపాలని చూశారు.. నేను వచ్చాక ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాను.. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం.. యువతే దేశానికి అతిపెద్ద సంపద
ప్రొఫెసర్ కోదండరాంను 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీకి ఎంపిక చేసి శాసనమండలికి పంపిస్తాం.తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ ఉస్మానియా కళా విహీనంగా మారిన పరిస్థితి ఏర్పడింది.. కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు.. చైతన్యం అందించిన ఓయూను కాలగర్భంలో కలపాలని చూశారు.. నేను వచ్చాక ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాను.. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం.. యువతే దేశానికి అతిపెద్ద సంపద-సీఎం రేవంత్ రెడ్డి సభకు పంపుతాం.. ఎవరు అడ్డం వస్తారో చూస్తా.. ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే తప్పేంటి?.. HCUలో క్రూర మృగాలు లేవు.. మానవ రూపంలో ఉన్న మృగాలన్నీ ఫాంహౌస్‌లో ఉన్నాయి-సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ భావోద్వేగ ప్రసంగం..!

25
Aug