Ration Card News: రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. వారందరికీ లబ్ది.. ప్రభుత్వ నిర్ణయం!

BB6 TELUGU NEWS  : 9 Aug 2025
Ration Card News: తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ఆ లోపే రేషన్ కార్డు దారులకు లబ్దిని కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి పెద్ద ప్లాన్ రెడీ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. అవి అధికార పార్టీకి 2 రకాల సమస్యలు తెస్తాయి. మొదటిది ఆ ఎన్నికల్లో గెలవడం ఒక సవాలు. అది రాజకీయ పరమైన అంశం. రెండోది పథకాల అమలు సవాలు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే.. కొత్త పథకాల అమలు ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే త్వరలో కొత్త పథకాల అమలు కష్టం. అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు దారులకు లబ్దిని త్వరగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యే కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం ప్రారంభించింది. వాటిని పొందిన వారికి రేషన్‌, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500కే సబ్సిడీ సిలిండర్ వంటి ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే, ఇలాంటివి ప్రారంభించడం కష్టం. అందుకే ప్రభుత్వం.. ముందుగానే వీటిని ప్రారంభించేసి.. ఆగస్టులోనే వాటిని లబ్దిదారులకు ఇచ్చేయాలని ప్లాన్ చేస్తోంది.
స్థానిక ఎన్నికలకు ముందే వీలైనంత మంది అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చెయ్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇలా చెయ్యాలంటే.. ఆయా పథకాల లబ్దిదారుల జాబితాల్లో.. కొత్త రేషన్ కార్డులు పొందిన వారి పేర్లను యాడ్ చెయ్యాల్సి ఉంటుంది. ఇది చిన్న ప్రక్రియ కాదు. దీనికి అధికారులు కొంత కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల లబ్దిదారుల జాబితాలో కొత్త రేషన్ కార్డు దారుల కుటుంబాల పేర్లను చేర్చాల్సి ఉంది. ఇప్పుడు ఆ పని జరుగుతోంది.
ఈ పనిని అధికారులు స్వయంగా చెయ్యరు. లబ్దిదారులు.. దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం లబ్ధిదారులు ప్రజాపాలన కేంద్రాలకు వెళ్లి.. మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు పరిశీలించి.. ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ పథకాల్లో వారి పేర్లను చేర్చుతారు. ఈ కారణంగానే ఇప్పుడు చాలా మంది ప్రజా పాలన కేంద్రాలకు క్యూ కడుతున్నారు.తెలంగాణలో సెప్టెంబర్ 30 లోపు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు పూర్తి చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందువల్ల ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఆ లోపే.. కొత్త పథకం ఒకటి ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉంటుంది. దాని కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారెంటీ పథకాల్లో ఒకటి.మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వడమంటే.. సంవత్సరానికి రూ.30,000 ఇస్తారని అర్థం కాబట్టి.. ఇది పెద్ద పథకం. ఇది అమలైతే తెలంగాణలో సంచలనం అవుతుంది. ముఖ్యంగా ఇది ప్రతిపక్షాలకు పెద్ద షాక్ అవుతుంది. గత 18 నెలలుగా ప్రతిపక్షాలు.. ఈ పథకం ఏది అని ప్రశ్నిస్తున్నాయి. దీన్ని అమలు చేసి, అప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్తే, తాము కచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ నమ్మకంతో ఉంది. అందువల్ల ఈ పథకం గేమ్ ఛేంజర్ కాబోతోంది అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పథకం కింద 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తారని తెలుస్తోంది. దీన్ని రాష్ట్రంలోని లక్షల మంది మహిళలు పొందగలరు. ఇప్పటికే ఉచిత బస్సు పథకాన్ని వారు పొందుతున్నారు. అలాగే ఇది కూడా అమలైతే.. మహిళల ఓట్లు తమకే దక్కుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్ల ఇది బీఆర్ఎస్, బీజేపీలకు నచ్చని పథకంగా ఉంటుందనుకోవచ్చు. ఇది అమలైతే, రాజకీయంగా ఆ పార్టీలకు పెద్ద సవాలే అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మీరు గనుక కొత్త పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే.. ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీసులకు వెళ్లాలి. అక్కడ మీకు ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉంటాయి. వాటిని కొత్తగా ఏర్పాటు చేశారు. అక్కడ మీకు దరఖాస్తు పత్రాలు లభిస్తాయి. మీరు వెళ్లేటప్పుడే.. మీ ఆధార్, రేషన్ కార్డు, ఫొటోలు, ఇతరత్రా గుర్తింపు పత్రాల జిరాక్సులు కూడా తీసుకెళ్తే.. అప్పటికప్పుడే.. మీ పని పూర్తవ్వగలదు. మహాలక్ష్మి పథకం కింద రూ.500ల సిలిండర్ కోసం లబ్దిదారులు.. గ్యాస్ ఏజెన్సీ దగ్గర కేవైసీ చేయించుకోవాలి. అప్పుడు 17 అంకెల కన్యూమర్ నెంబరు ఇస్తారు. దాన్ని ప్రజాపాలన కేంద్రంలో చూపించాలి. అలాగే గ్యాస్ సిలిండర్ తీసుకునే టైంలో ఇచ్చే రసీదును కూడా చూపించాలి. మొబైల్ నెంబర్ చెప్పాలి. ఆ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని వారికి చెప్పాలి. ఇలా ఈ పథకాల లబ్దిని రేషన్ కార్డు దారులు తప్పక పొందాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe