BB6 TELUGU NEWS 6 Aug 2025
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పోరుబాట
కాసేపట్లో జంతర్‌మంతర్‌లో టి.కాంగ్రెస్ నేతల ధర్నా.BC రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని డిమాండ్..ఉ.11 నుంచి మ.ఒంటిగంట వరకు ధర్నాకు అనుమతి. ధర్నాకు హాజరుకానున్న రాహుల్, ఖర్గే, ప్రియాంకాగాంధీ.ధర్నాలో పాల్గొననున్న రేవంత్, మహేష్‌గౌడ్, మంత్రులు.నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో బీసీ ధర్నా.. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలంటూ కాంగ్రెస్ డిమాండ్.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నాకు అనుమతి.. బీసీ ధర్నాకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ధర్నాలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు.
టిపిసిసి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో 5, 6, 7 తేదీలలో జరగనున్న “ఛలో ఢిల్లీ” కార్యక్రమంలో పాల్గొనడానికి ఈరోజు వికారాబాద్ జిల్లా నుండి (ఉమ్మడి రంగారెడ్డి జిల్లా) నుండి పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు ద్వారా బయలుదేరారు.*
ఈ సందర్భంలో పరిగి ఎమ్మెల్యే & డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నాయకులు, కార్యకర్తల అవసరాలను స్వయంగా పరిశీలించి,వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక రైలులో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు .ప్రతి ఒక్కరిని గుర్తించి, వారి రవాణా, భద్రతా ఏర్పాట్లు చూసుకుంటూ ఢిల్లీకి విజయవంతంగా తరలించారు.వెంట రంగారెడ్డి జిల్లా డి.సి.సి.అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి , మేడ్చల్ జిల్లా డి.సి.సి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

