మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజీ ముందు ధర్నా చౌక్ దగ్గర  ధర్నా కార్యక్రమంలో గర్జిస్తున్న USPC నాయకులు

BB6 TELUGU NEWS  6 Aug 2025 :
ఉపాధ్యాయుల సమస్యల పైన రాజీలేని పోరాటం చేసే సంఘం కేవలం TSUTF.
రాష్ట్రంలో విద్యారంగం  ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిరంతరం పోరాడుతున్నది ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ ఐక్యంగా పోరాడి అనేక హక్కుల సాధించుకున్న చరిత్ర ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గత పాలకుల నియంతృత్వ విధానాల వల్ల ఐక్య ఉద్యమాలు నిర్వీర్యం ఉద్యోగ వర్గం నష్టపోయింది అదే సందర్భంలో USPC చొరవతో కలిసొచ్చిన ఇతర ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సంఘాలతో వేదికను పిఆర్సి బదిలీలు ప్రమోషన్ల సాధనకు జీవో 317ను సవరించాలని సిపిఎస్ రద్దు చేయాలని పోరాటాలు నిర్వహించి క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొన్న చరిత్ర మీకు తెలుసు  ప్రధాన డిమాండ్లు జీవో నెంబర్ 25ను సవరించాలి ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరూ ఉపాధ్యాయులు ఉండాలి 40 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలో తరగతికొక టీచర్ ఉండాలి అన్ని రకాల పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలి రిటైర్ అయిన ఉపాధ్యాయుల పెన్షన్  బెనిఫిట్ విడుదల చేయాలి సిపిఎస్ లో రద్దు చేసి ఒపీఎస్ ను పునరుద్ధరించాలి నూతన జిల్లాలకు డీఈఓ పోస్ట్లు ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ డిఇఓ  మండలాలకు రెగ్యులర్ ఎంఈఓ  పోస్టులను భర్తీ చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలి కేజీబీవీ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలి మోడల్ స్కూల్స్ గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి నీ గురుకులం పాఠశాల టైం టేబుల్ లో శాస్త్రీయంగా సవరించి విద్యార్థులు ఉపాధ్యాయులకు అనుకూలంగా మార్పు చేయాలి డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అర్హత లేని ఆరోపణలను ఎదుర్కొంటున్న డిఇఓ లను తొలగించాలి అని జిల్లా అధ్యక్షులు కే రవికుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు రాఘవచారి టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.రవికుమార్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ టి పి టి ఎఫ్ మైముద్ అన్ని మండలాల టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు టీచర్స్ పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe