హన్వాడ మండలంలోని వేపూర్, రామన్న పల్లి గ్రామాల్లో చిరుత పులి దాడి ఇద్దరికీ గాయాలు రెండు లేగదూడల హతం.

మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. హన్వాడ మండలంలోని వేపూర్, రామన్న పల్లి గ్రామాల్లో చిరుత పులి రెండు రోజుల వ్యవధిలో లేగదూడలపై ముగ్గురు వ్యక్తులపై దాడి, దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

BB6 TELUGU NEWS 27-july-2025 హన్వాడ : మండలం లో చిరుతపులి సంచారంకలకలం రేపుతోంది. హన్వాడ మండలం వేపూర్,రామన్న పల్లి గ్రామాల్లో ఆదివారం, సోమవారం రెండు రోజులు లేగదూడలపై దాడి చేసి చంపడంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే రోజువారీగా పశువులను తమ వ్యవసాయ క్షేత్రంలోనే కట్టేసి రాత్రివేళ రైతులు ఇంటికి వస్తుంటారు. యథా విధిగా సోమవారం ఉదయం రైతు తుప్పలి చెంద్రయ్య పొలం దగ్గరికి వెళ్లి చూడగా చిరుత దాడి చేసి లేగ దూడను చంపేసిందని బాధితుడు ఆవేదనతో తెలిపారు.ఈ విషయాన్ని రైతు చెంద్రయ్య ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ చుట్టు పక్కల ప్రదేశాలు పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు దాడి చేసింది చిరుతపులా లేక వేరే జంతువా అనే విషయం గుర్తించేందుకు చర్యలు చేపడతామనిఅన్నారు. చిరుత ఆదివారం రామన్నపల్లి గ్రామానికి చెందిన అచ్చనోళ్ల వెంకటయ్య అనే రైతుకు చెందిన లేగదూడను చంపింది. రెండురోజులు వరుసగా చిరుత దాడి చేసి లేగదూడలను చంపడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో ముగ్గురు పై చిరుత పులి దాడి చేయగా గాయపడ్డ  సత్యనారాయణ రెడ్డి , మైబయ్య , చెన్నారెడ్డిలను మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు .మహబూబ్నగర్ ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe