BB6 TELUGU NEWS 27 july 2025 :
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు(Maoists) మధ్య జరిగిన ఎదురుకాల్పులలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుండి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల మృతి

27
Jul