బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని బారత వాతావరణశాఖ హెచ్చరించింది.

Rains Alert: ఏపీకి వాయుగుండం ఎఫెక్ట్.. నెలాఖరు వరకు భారీ వర్షాలు

BB6 TELUGU NEWS 26 july 2025 :
Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని బారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం శుక్రవారం పశ్చిమ బెంగాల్ ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్,ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా కదులుతుంది. దీని ఫలితంగా దక్షిణ కోస్తా తీరంలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.
తుఫాను సూచన..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తాంద్రలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలు మరో మూడ్రోజుల పాటు అంటే ఆదివారం వరకు కురిసే అవకాశం ఉండటంతో ఏపీ హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి అనిత ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ స్వయంగా పరిశీలించారు.ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్
ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఎక్కడైనా ప్రజలు భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే కాల్ చేయవచ్చని సూచించారు మంత్రి..
కోస్తాంధ్ర, సీమాంధ్రపై ఎక్కువ ఎఫెక్ట్..
రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ..తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చిరించారు.సహాయక బృందాలు రెడీ..
భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని విపత్తు నిర్వహణశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.ఇరిగేషన్, ఆర్& బి, పంచాయితీరాజ్ శాఖలతో నమన్వయ పరుచుకుని గండ్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe