మరో రెండ్రోజులు భారీ వర్షాలు..  కరెంటుతో జాగ్రత్త!

వానా కాలంలో కరెంటుతో ⚡ జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఈ కాలంలో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాల బారినపడే అవకాశాలు ఉంటాయి. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలకు ఇల్లు, వాకిలి, నేలంతా తడిగా ఉండటంతో విద్యుత్ షాక్‌లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

BB6NEWS 24 july: వానా కాలం(monsoon season)లో కరెంటుతో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఈకాలంలో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాల బారినపడే అవకాశాలు ఉంటాయి. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలకు ఇల్లు, వాకిలి, నేలంతా తడిగా ఉండటంతో విద్యుత్ షాక్(Electric Shock)లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యుత్తు| ప్రమాదాల బారిన పడకుండా కొన్ని ముందు జాగ్రత్తలివే. తడి చేతులతో విద్యుత్ బోర్డులో స్విచ్లు, ప్లగ్లు ఇతర ఉపకరణాలను తాకితే ప్రమాదం. కరెంట్షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది.• మీ ఇంట్లో తడిసిన, అతుకుల విద్యుత్తు తీగలు ఉంటే షార్ట్ సర్క్యూట్ కు కారణం కావొచ్చు.అందువల్ల ఏదైనా లోపం ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఎలక్ట్రిషియన్తో మార్పించుకోండి.

• రహదారి వెంట ఉన్న విద్యుత్తు స్తంభాలు, సపోర్టు వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దు. ఇంటి బయట ఉన్న ఎలక్ట్రికల్ పరికరాలను వాటర్ ప్రూఫ్కవర్లతో కప్పి ఉంచండి. తద్వారా వాటిలోకి వర్షంనీరు చేరకుండా ఉంటుంది.• ఇంట్లో ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ (ELCB) లేదా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ (MCB) ఉండేలా చూసుకోండి. ఇవి షార్ట్ సర్క్యూట్ లేదా లీకేజీ సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేసేందుకు ఉపయోగపడతాయి.

మీరు బట్టలు ఆరబెట్టుకొనే తీగకు విద్యుత్తు తీగలుతగల కుండా జాగ్రత్తపడండి.విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తే వెంటనే విద్యుత్తు సంస్థ అధికారులకు సమాచారం ఇవ్వండి.ఇందుకోసం అత్యవసర నంబర్లను రాసి పెట్టుకోండి. వర్షం పడుతున్న సమయంలో వ్యవసాయ మోటార్లను ఆన్ చేయొద్దు. పిడుగులు పడే సమయంలో ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆఫ్ చేసి.. ప్లగ్లు తీసేయండి. వర్షాకాలంలో పిల్లలు తడి చేతులతో లేదా తడి నేలపై ఎలక్ట్రిక్సామగ్రిని తాకకుండా జాగ్రత్తగా చూసుకోండి.

వర్షం పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్లకు దగ్గరగా ఉండొద్దు. పశువులను సైతం విద్యుత్ పరికరాలకు దూరంగా సురక్షితంగా ఉంచేలా చూసుకోండి. రోడ్లపై, నీటిలో విద్యుత్తు తీగలు పడి ఉంటే వాటిని తాకొద్దు. వాటిపై వాహనాలనూ నడిపే సాహసం చేయొద్దు. ఎక్కడైనా తీగలు తెగిపడితే సమీప విద్యుత్ సిబ్బందికి లేదా కంట్రోల్ రూం నంబర్లకు ఫోన్ చేసి చెప్పండి.ఎవరికైనా విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురైతే..రక్షించడానికి లోహపు వస్తువులు, ఇనుప రాడ్లను వాడొద్దు. చెక్క లేదా ప్లాస్టిక్ తో చేసిన పరికరాలే ఉపయోగించండి.

ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీరు అనధికారికంగా ఫ్యూజులు మార్చడం, మరమ్మతులు చేపట్టడం వంటివి చేయొద్దు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe