మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో దాశరథి కృష్ణమాచార్య జయంతి ఘనంగా నిర్వహించారు. దాశరథి కృష్ణమాచార్య ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో 1925 సంవత్సరం జులై 22న జన్మించారు. ఇతను ఉపాధ్యాయుడిగా కెరీర్ ను ప్రారంభించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. రచయితగా కవిగా సమాజాన్ని మేల్కొల్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణ ఇంకా నిజం పాలనలో నరకం అనుభవించడాన్ని చూస్తూ భరించలేక తన అక్షరాలతో పోరు ప్రారంభించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆయన రచనలు ఎందన్నో ఆలోచింపజేశాయి. నిజం ను ధిక్కరించినందుకు జైలు జీవితాన్ని కూడా గడిపాడు. అయినా కూడా తన దిక్కర స్వరం ఆపలేదు. జైలు గోడల పైనే తను రచనలు చేశారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన ప్రసిద్ధ కవి ఇతను 1987 నవంబర్ ఐదు తారీకు రోజు తుది శ్వాస విడిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, బి.మల్లేష్, కె.వెంకటయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా దాశరథి కృష్ణమాచార్య 100వ జయంతి

22
Jul