సీఎం సార్ వికలాంగులు వృద్ధులు గుర్తున్నారా…?ఎలక్షన్లో గెలిచితే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు గెలిచాక మమ్మల్ని మరిచారు ఎందుకు ..?
వృద్ధులకు 4000 వేలు వికలాంగులకు 6000 వేలు రూపాయల పింఛన్లు ఎప్పుడు ఇస్తారు..?
పింఛన్లు పెంచకుంటే కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పై పోరాటానికి సిద్ధాం.. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన వృద్ధులు వికలాంగులు..
మహమ్మదాబాద్, జూలై 19
కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో గెలిస్తే వృద్ధులకు 4000 వేలు, వికలాంగులకు 6000 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం, నేడు గెలిచాక వృద్ధులను వికలాంగులను మరిచిపోయారు ఎందుకు, ఇచ్చిన మాటకు కట్టుబడి మాకు పింఛన్లు పెంచండి అంటున్నా వృద్ధులు, వికలాంగులు,శనివారం నాడు ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి జిల్లా ఇన్చార్జి బొర్ర బిక్షపతి మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బీచ్చ నాయక్, రాష్ట్ర నాయకులు దానకారి రవి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దానకారి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో వికలాంగులు వృద్ధుల పింఛన్లు పెంపుపై సమావేశం నిర్వహించారు,ఆదివారం నాడు మహబూబ్నగర్ జిల్లాలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వికలాంగుల వృద్ధుల పెన్షన్లు పెంపు కై సమావేశం నిర్వహిస్తున్నామని ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ హాజరవుతారు కనుక వికలాంగుల వృద్ధులు ఈ సమావేశానికి రావలసిందిగా కోరారు,ఈ సందర్భంగా వికలాంగుల వృద్ధులు మాట్లాడుతూ, సీఎం ఎలక్షన్లో ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు పెంచాలని అన్నారు, శక్తివంతమైన ఎటువంటి పని చేయడానికి చేతకాని వ్యక్తులం,అంగట్లో అన్నీ అధిక ధరలు కలిగిన వస్తువుల ధరలు భగ్గు మంటున్నాయి,ఏమి కొనేటట్లు లేదు ఏమి తినేటట్లు లేదు, భార్యా పిల్లలు కలిగి ఉన్న మేము నెల మొత్తం పెన్షన్ తోనే కాలం వెలదీస్తున్నాం, పెన్షన్ తప్ప ఎటువంటి జీవనాధారం లేని వ్యక్తులం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి పింఛన్లు పెంచుతామని అంటే మీకు ఓటు వేసి గెలిపించాం నేడు మీరు మమ్మల్ని మరచితిరి ఎలా,అంటూ సీఎంని ప్రశ్నిస్తున్న వృద్ధులు వికలాంగులు,చేయూత పెన్షన్స్ ద్వారా వికలాంగులకు 6000,వేలు వృద్ధులకు 4000,వేలు రూపాయలు ఇస్తా అంటిరి నేటికీ మీరు గెలిచి 18 నెలలవుతున్న చేయూత పింఛన్లు పెంచలేరు,ఎందుకు ఎలక్షన్ లో ఇచ్చిన మాటకు కట్టుబడి మాకు పింఛన్లు పెంచండి లేదంటే కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పింఛన్లు పెంచండి అంటూ గవర్నమెంట్ పై పోరాటానికి సిద్ధం, రాస్తారోకోలు,ధర్నాలు, అసెంబ్లీ ముట్టడిలు చేస్తాం, అంటూ, అల్టిమిట్టం జారీచేసిన వృద్దులు వికలాంగులు, ఎలక్షన్లో ఇచ్చిన మాట కట్టుబడి వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు పెంచి వారిని ఆదుకోవాలి,లేదంటే వికలాంగులు వృద్ధుల పక్షాన పెన్షన్లకై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి జిల్లా ఇన్చార్జి బొర్ర బిక్షపతి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు దాన కారి సురేష్, జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు జయపాల్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ మండలాధ్యక్షుడు వేణు గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వెంకటయ్య ఎస్ రామయ్య ఏ మోనయ్యా, ఎల్లమ్మ, దస్తమ్మ, లక్ష్మి, దస్తయ్య, తదితరులు పాల్గొన్నారు