యూపీఐ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల యూపీఐ పేమెంట్స్‌ను కొందరు యాక్సెప్ట్ చేయడం లేదు. దీనివెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే.?
వ్యాపారులకు నోటీసులు
బెంగళూరులో వీధి బదుల వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులకు ఇటీవల రాష్ట్ర వాణిజ్య పన్ను శాఖ జారీ చేసిన జీఎస్టీ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. జీఎస్టీకి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా యూపీఐ (UPI) ద్వారా సంవత్సరానికి రూ.40 లక్షలకుపైగా లావాదేవీలు చేసిన 14,000 మంది వ్యాపారులను గుర్తించారు. వీరిలో 5,500 మందికి మొదటి దశలో నోటీసులు జారీ చేశారు.
UPI: ఫోన్‌పే వద్దు డబ్బులే ఇవ్వండి.. దుకాణదారులు ఇలా ఎందుకు చేస్తున్నారంటే.

15
Jul