మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే బీజేపీ పార్టీ ఎలా బలపడుతుంది ?

సొంత పార్టీపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా, కార్యకర్తలతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మీకు దేశ భక్తి, దైవ భక్తి ఉంటే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ లో చేరండి, బీజేపీ లాంటి రాజకీయ పార్టీలో ఉండే అర్హత మీకు లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన విశ్వేశ్వర్ రెడ్డి

బీజేపీ రాజకీయ పార్టీ కాదని, దేశభక్తి పేరుతో వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు పార్టీని బలహీనం చేస్తున్నారని పేర్కొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే పార్టీ ఎలా బలపడుతుందని కార్యకర్తలను ప్రశ్నించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

పైన మోడీ ఇక్కడ నేను ఎలాగు గెలుస్తామని, అధ్యక్ష్య పదవుల కోసం కొట్టుకోవడం కాకుండా పార్టీని బలోపేతం చేయడానికి పని చేయాలని కార్యకర్తలను ఆదేశించిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe