హైకోర్టులో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నెల రోజులు గడువు ఇవ్వండి.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై సోమవారం (జూన్ 23)హైకోర్టులో విచారణ జరిగింది. దాదాపు 6నెలల తర్వాత ఈ కేసు హైకోర్టు బెంచ్ముందుకు విచారణకు వచ్చింది. ఈసందర్భంగా ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు మరో నెల రోజుల సమయం ఇవ్వాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం.

2025 ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించగా..రాష్ట్రం లో కులగణన సర్వే పూర్తి కాలేదని..సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అదే సందర్భంలో ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ హైకోర్టును కోరింది.
ఈ సందర్భంగా పిటిషనర్లు వాదనలు వినిపించారు. ఎన్నికలైనా పెట్టండి .. లేదా పాత సర్పంచులనే కొనసాగించండని పిటిషనర్లు వాదించారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్వహించలేదని ప్రశ్నించారు.ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. స్థానిక సంస్థల ఎన్నికలపై మధ్యాహ్నం తరువాత నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది.

గ్రామ పంచాయతీ ఎన్నికలపై మధ్యాహ్నం పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు పూర్తయ్యాయి. ఈసందర్భంగా ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల సమయం కావాలని ప్రభుత్వంకోరింది. మరోవైపు రెండు నెలల సమయం కావాలని కోరింది ఎన్నికల సంఘం. దీంతో తీర్పు రిజర్వ్ చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe