తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వానకాలం పంట పెట్టుబడి కోసం 9 రోజులలో 9000 కోట్ల రూపాయలతో రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రైతు భరోసా సంబరాలను రైతులతో కలిసి గండీడ్ మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి,తిరుపతయ్య,భగవంతు రెడ్డి, కృష్ణయ్య,దుర్గా నాయక్, బసయ్య,మొగులయ్య తదితరులు పాల్గొన్నారు
గండీడ్ మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు

24
Jun