భూత్పూర్ “మీ సేవా” కేంద్రంగా గూడుపుఠాణి.. చిలకమర్రి” భూ అక్రమాలలో వెలుగు చూసిన నిజం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు పట్టేదారుల భూమిని జిపిఏ ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ అయిన అక్రమ వ్యవహారంలో మీసేవ కేంద్రం నిర్వాహకులు హస్తవాటం ప్రదర్శించినట్టు తెలిపారు. దాదాపు ఏడు కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించి జిపిఎ ద్వారా రైతులకు తెలియకుండా రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవహారంలో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓటిపి నెంబర్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని తదితర పత్రాల ద్వారా  ధరణిలో భూములను తమ పేరుకు బదలైపు చేసుకున్న వ్యవహారంలో మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మీసేవ కేంద్రంగా ఈ స్లాట్ బుక్ చేసినట్లు
ఈతతంగంలో వెలుగుచూస్తుంది.
భూత్పూర్ మీసేవ కేంద్రం కు సంబంధించి సదరు రిజిస్ట్రేషన్లలో
ధరణిలో జిపిఏ చేయడానికి కొత్తపల్లి సుభాన్ రెడ్డి పేరిట రైతు కొత్తపల్లి వినోద ఓటీపీని వాడుకున్నారు. భూత్పూర్ లోని  టిఎస్ _ఆర్ఎఫ్ఎంబి 085 మీ సేవ కేంద్రం ద్వారా 2024 సంవత్సరంలో ఆగస్ట్ 6న రాత్రి ఏడు గంటల 40 నిమిషాలకు
ఈకేవైసి చేయించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ సేవ కేంద్రం యజమాని ప్రవీణ్ కుమార్ పేరిట ఉన్నట్లు సదురు పట్టణంలో పేర్కొనబడింది. ఫరూక్ నగర్ తహసిల్దార్ పార్థసారథి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన అర్కిత పూర్వక ఫిర్యాదులో మీ సేవ కేంద్రం యజమాని ఆపరేటర్లను బాధ్యులుగా చేస్తూ ఫిర్యాదు చేసిన విషయం విధితమే. తాజాగా ఈకేవైసీ జరిగిన విధానంలో భూత్పూర్ మీసేవ కేంద్రం వివరాలు వెలుగు చూడడం గమనర్హం. మొత్తం ఈ అక్రమాలలో చిలకమర్రి గ్రామానికి చెందిన కొత్తపల్లి మధుసూదన్ రెడ్డి స్థానికంగా మీసేవ కేంద్రాలను వాడుకోకుండా భూత్పూర్ వద్ద ఈ అక్రమాలకు తెర లేపినట్లు అవగతం అవుతుంది..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe