తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్ MLA కౌశిక్‌రెడ్డి  అరెస్ట్ గ్రానైట్ వ్యాపారికి బెదిరింపులు.BRS ఎమ్మెల్యే అరెస్ట్

ఓ గ్రానైట్ వ్యాపారి బెదిరింపుల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మనోజ్ అనే వ్యాపారిని రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించారని ఆయన భార్య ఉమాదేవి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

హనుమకొండ: సుబేదారి పీఎస్‌లో MLA కౌశిక్‌రెడ్డి గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో.కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు.కౌశిక్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు సుబేదారి పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత.పీఎస్‌ ఎదుట బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఆందోళన పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం

కౌశిక్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. రాజకీయ కక్షసాధింపులనే పనిగా పెట్టుకుంది. కేసుల పేరుతో వేధిస్తూ రాక్షసానందం పొందుతోంది రేవంత్‌ ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్నారు హరీష్‌రావు.

కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌ దుర్మార్గమైన చర్య.
రేవంత్‌ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా
అవినీతిని ప్రశ్నిస్తున్న కౌశిక్‌పై కక్షకట్టారు.
మా మనోధైర్యాన్ని కేసులు దెబ్బతీయలేవు.
కౌశిక్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి-కేటీఆర్‌

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe