BB6 TELUGU NEWS CHANNEL. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను గౌరవ జోనల్ కమిషనర్ శ్రీ అపూర్వ చౌహన్ గారు, గౌరవ డీసీ శ్రీ గంగాధర్ గారు, గౌరవ కార్పొరేటర్లు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్ , పారిశుధ్య విభాగం అధికారులతో కలిసి పాదయాత్ర చేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజుల రామరం వెళ్లే రోడ్డు వయా ఎల్లమ్మబండ రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని ,ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగినది అని దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై అధికారులు, కార్పొరేటర్ల తో కలిసి ఉషముళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తీ వరకు పాదయాత్ర గా స్వయంగా నడుచుకుంటూ వెళ్లడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. 100ఫీట్ రోడ్డు విస్తరణలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యల పై చర్చించి, ప్రణాళిక ను రూపొందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని, యుద్ధప్రాతిపదికన రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్డు విభాగిని పనులు నాణ్యత ప్రమాణాలు తో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని , నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, అధికారులను PAC చైర్మన్ గాంధీ గారు అదేశించడం జరిగినది.
ఉషముళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తి వరకు ఎల్లమ్మ బండ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన గల విద్యుత్ స్థంబాలను స్థాన భ్రంశం చర్యలను వెంటనే చేపట్టాలని, అదేవిధంగా రోడ్డు డివైడర్ మధ్యలో సుందరికరణ పనులు చేపట్టాలని అన్నారు.
అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ గారు. పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానార్ గణపతి,ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE గోవర్ధన్ AE రాజీవ్, AE శ్రావణి, AE నిఖిల్, వర్క్ ఇన్స్పెక్టర్లు మహాదేవ్, రవి కుమార్ , గురువా రెడ్డి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు DE జనప్రియ, AE దయ నంద్, ADE లైన్స్ మధుకర్ ,AE కరణ్ కుమార్, స్ట్రీట్ లైట్స్ DE స్వప్న AMOH శ్రీనివాస్ ,SRP నాయక్ మరియు నాయకులు ,కార్యకర్తలు , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో అధికారులతో కలిసి పాదయాత్ర చేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ

18
Jun